WATCH: Caught on camera, man shoots son-in-law in Bihar's Buxar over love marriage
mictv telugu

బార్బర్ షాప్‌లో అల్లుడిపై కాల్పులు.. పోలీసుల అదుపులో రిటైర్డ్ సోల్జర్

June 7, 2022

WATCH: Caught on camera, man shoots son-in-law in Bihar's Buxar over love marriage

తన కూతురు వేరే కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో.. ఏడాది తర్వాత తండ్రి, కొడుకుతో కలిసి దారుణంగా హత్య చేశాడు. కటింగ్ షాపులో షేవింగ్ చేయించుకుంటున్న అల్లుడిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ దారుణ ఘటన ఆదివారం బీహార్‌లోని బక్సర్ జిల్లా దుమ్రావాన్ గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి.

వీడియోలో ఒక వ్యక్తి బార్బర్ షాప్‌లో షేవింగ్ చేయించుకుంటుండగా.. ఓ యువకుడు అకస్మాత్తుగా తిరిగి పిస్టల్‌తో అతని తలపై కాల్చాడు. అది గురితప్పడంతో.. బాధితుడు లేచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడున్న బార్బర్‌తో పాటు మరో వ్యక్తి కూడా బయటకు పరుగెత్తారు. అనంతరం కాల్పులు జరిపిన వ్యక్తి.. షాప్‌లో తీసుకున్న రేజర్‌తో బాధితుడిపై దాడి చేశాడు. ఆ తర్వాత అతనితో పాటు మరో వ్యక్తి పిస్టల్‌తో లోపలికి వచ్చి బాధితుడి తలపై మళ్లీ కాల్చాడు. బాధితుడు కుప్పకూలడంతో నేలపై పడి ఉన్న ఆ వ్యక్తిపై భౌతికంగా దాడి చేశారు. రక్తపుమడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని వదిలి.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సోను రాయ్ సోదరుడు మోను రాయ్‌గా గుర్తించారు. రిటైర్డ్ ఆర్మీ సిబ్బంది అయిన మామ సునీల్ పాఠక్.. అనంతరం ఎస్పీకి ఫోన్ చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఈ కేసులో అతని కుమారుడు ధను పాఠక్ కూడా అరెస్టయ్యాడు.