వెంట్రుకవాసిలో చావు నుంచి తప్పించుకున్నారు ఇద్దరు పిల్లలు. రైలుపట్టాల మధ్య పరుగెత్తుతున్న సమయంలో ఆకస్మాత్తుగా వెనుక వచ్చిన రైలు నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఏడాది మే 20 న కెనడాలోని టోరంటోలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను కెనడియన్ రవాణా సంస్థ మెట్రోలింక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
రైలు లోపలి నుంచి తీసిన ఈ వీడియోలో.. ఇద్దరు పిల్లలు పట్టాల మధ్యలో పరిగెత్తుతూ కనిపించారు. వేరు వేరు ట్రాక్ల మధ్యలో ఆ ఇద్దరు ఉండగా.. అకస్మాత్తుగా రైలు వచ్చింది. అదే సమయంలో ఒక పిల్లవాడు అకస్మాత్తుగా రైలు వెళ్లే పట్టాల మీదకు వచ్చేశాడు. ఈ క్రమంలో అతను రైలు కింద పడిపోయినట్లు అనిపిస్తుంది. కానీ.. అదృష్టవశాత్తూ అతను అడుగు దూరం నుంచి తప్పించుకున్నాడు. క్షణం ఆలస్యమైనా ఆ చిన్నారి ప్రాణం పోయేది. ఇది చూసిన నెటిజన్లు.. అదృష్టవశాత్తూ తప్పించుకున్నారని కామెంట్లు చేస్తున్నారు.
⚠️ This heart-stopping video shows the dangers of walking on railways. Watch as young people come within a foot of serious injury or death while trespassing on a rail bridge in Toronto.
Talk to your kids about rail safety. Resources here: https://t.co/X5uS2ewqui #MetrolinxFYI pic.twitter.com/R8P6dmDFdW
— Metrolinx (@Metrolinx) May 30, 2022