పెళ్లి బారాత్‌లో చిందేసిన కుక్క.. అందరూ ఫిదా.. - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లి బారాత్‌లో చిందేసిన కుక్క.. అందరూ ఫిదా..

February 17, 2019

కొందరికి డీజే సౌండ్ వినగానే వెళ్లి నాలుగు స్టెప్పులు వేయాలని ఒళ్లంతా తహతహలాడుతుంటుంది. అలా వూళ్లో ఎవరి పెళ్లి అయినా జరిగితే వెళ్లి నాలుగు స్టెప్పులు వేసి అక్కడున్నవారిని, వధూవరులను ఆనందపరుస్తారు. అలానే చేసింది ఓ కుక్క. పిలవని పేరంటానికి వెళ్లి హడావిడి చేసిందా కుక్క. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్న నానుడిని నిజం చేసింది. మెక్సికోలోని ఆక్సాకా నగరంలో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. మన దగ్గర బారాత్ నిర్వహించినట్టు అక్కడ కూడా ఓ వివాహవేడుక నిర్వహిస్తున్నారు.

 

మెక్సికోలో జరిగే పెళ్లివేడుకల్లో వధూవరులు ఇద్దరూ డ్యాన్స్‌లు చేయడం సంప్రదాయం. ఆ పెళ్లికి వచ్చిన బంధువులు కూడా నృత్యాలు చేస్తూ పెళ్లిని మరింత ఆనందమయం చేస్తారు. ఓ మహిళ తలపై భారీ పూల బుట్టను పెట్టుకుని డాన్స్ చేస్తోంది. ఇంతలో అక్కడికి ఓ నల్లకుక్క వచ్చింది. ఓ వైపు మహిళ డాన్స్ చేస్తుంటే, ఆ కుక్క కూడా సంబరంతో ఆమె చుట్టూ ఎగురుతూ కొద్దిసేపు సందడి చేసింది. తల, శరీరం తిప్పుతూ, అరుస్తూ ఆమె చుట్టూ తిరిగింది. కుక్క విన్యాసాన్ని చూసిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వీడియో కాస్త వైరల్ అయింది. చాలా మంది కుక్క డాన్సుకు ఫిదా అవుతున్నారు.