Watch: Hand Pump Spews Fire In Madhya Pradesh Village
mictv telugu

కొంచెం నీరు, కొంచెం నిప్పు.. చేతిపంపు వీడియో వైరల్

August 25, 2022

సాధారణంగా చేతి పంపులోంచి నీరు వస్తాయి. కానీ, ఒకేసారి నీరు, మంటలు కలిపి వస్తే మాత్రం కచ్చితంగా వింతే. నీటికి మంటలను ఆర్పే శక్తి ఉండగా.. నీరు , అగ్ని ఓకే పంపు నుంచి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్ పూర్ జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాలోని కాచర్ గ్రామంలో గురువారం తెల్లవారు జామున ఈ వింత ఘటన జరిగింది. ఓ చేతి పంపులోంచి ఒకేసారి మంట, నీరు కలిసి వస్తున్నాయి. వాకింగ్ కి వెళ్లిన గ్రామస్థులు ఈ వింతను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతి పంపు నుంచి ఒకేసారి మంటలు, నీరు రావడం ఈ ప్రాంతంలో మొదటిసారి చూస్తున్నామని, పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈఘటనకు గల కారణాలు తెలిసే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈఘటన ఓ అద్భుతమని గ్రామంలో కొందరు అంటుంటే.. ఏదైనా రసాయనాలు పంపులో కలిసి ఉండొచ్చని.. అందుకే ఈమంటలు వ్యాపించాయని స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. వాస్తవానికి నీటి ఎద్దడితో ఈగ్రామ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో ఈచేతి పంపు నుంచి మంటలు రావడంపై మరింత ఆందోళన చెందుతున్నారు ఇక్కడి ప్రజలు.