పెచ్చులు కూడా ఊడకుండా 7600 టన్నుల భవనాన్ని తరలించారు..  - MicTv.in - Telugu News
mictv telugu

 పెచ్చులు కూడా ఊడకుండా 7600 టన్నుల భవనాన్ని తరలించారు.. 

October 25, 2020

Watch | Historic building moved to its new home on wheels in Shanghai, China

పసి పిల్లలు తమ అల్లరితో ఇల్లు పీకి పందిరి వేస్తారు. కానీ, ఈ ఇంజనీర్లు మాత్రం  7600 టన్నుల బరువు ఉన్న ఓ ఇల్లును పీకి అలాగే ఇంకొక చోటుకు తరలించారు. బస్సులు, లారీలు కదిలినట్టు ఇప్పుడు ఆధునిక టెక్నాలజీతో ఇళ్లను, భవనాలను కూడా ఇంజనీర్లు తరలిస్తున్నారు. చైనాకు చెందిన ఇంజినీర్లు ఈ  అద్భుతం చేసి ఔరా అనిపిస్తున్నారు. షాంఘైలో ఉన్న ఆ స్కూలు భవనం అత్యంత పురాతన చారిత్రాత్మక కట్టడం. 1935లో ఆ భవనాన్ని నిర్మించారు. అయితే దానిని ధ్వంసం చేయొద్దని అధికారులు భావించారు. అలాగని ఆ స్థలంలో ఆ భవనాన్ని ఉంచలేరు. దీంతో వారు ఇంజినీర్లను సంప్రదించారు. వారు అత్యంత సురక్షితంగా బిల్డింగ్‌ను మరో ప్రాంతానికి విజయవంతంగా తరలించారు. 

బిల్డింగ్‌ను పగులగొట్టకుండా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడంలో సఫలం అయ్యారు. ఆధునిక సాంకేతికత సహాయంతో ఇంజినీర్లు ఈ అద్భుతాన్ని సాధించారు. 

198 రోబోటిక్ టూల్స్‌ను వినియోగించి 62 మీటర్ల దూరం వరకు తరలించారు. ఈ ప్రక్రియకు వారికి 18 రోజుల సమయం పట్టిందట. కాగా, 2017లో కూడా ఇలాగే 135 ఏళ్ల పురాతన భవనాన్ని తరలించారు. 2 వేల టన్నుల ఓ బౌద్ధ మందిరాన్ని 30 మీటర్ల దూరం వరకూ తరలించారు. 15 రోజుల సమయం తీసుకుని ఆ మందిరాన్ని తరలించారు.