వెస్పా దోశ.. వైరల్ వీడియో.. మీరూ ట్రై చేయండి - Telugu News - Mic tv
mictv telugu

వెస్పా దోశ.. వైరల్ వీడియో.. మీరూ ట్రై చేయండి

June 10, 2022

ఈ వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగకు జనం బయటకు రావాలంటేనే వణుకుతున్నారు. ఈ క్రమంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో బైక్‌ మీద దోశ వేసి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఓ హైదరాబాదీ. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిపుణుల పర్యవేక్షణలో వెస్పా దోశ వేయడం జరిగింది అంటూ స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ భాగ్యనగర్ అనే ఇన్‌స్టా గ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఇక ఆ పోస్ట్ చూసిన నెటిజన్లంతా ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతను.. ఎండ వేడమికి ప్రజలు పడుతున్న బాధను ఫన్నీ వేలో చూపించారని ఆ యువకుడిని తెగ పొగిడేస్తున్నారు. లైక్‌లు.. షేర్‌ల రూపంలో ఆ యువకుడి వినూత్న ఆలోచనకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగానే 39.4 లక్షల మంది చూశారు. చాలా మంది నెటిజన్లు బెస్ట్ కిచెన్ చిట్కా అంటూ కామెంట్లు పెట్టారు. మరో యూజర్ నాన్ స్టిక్ దోశ అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకు 15 లక్షల లైక్స్ వచ్చాయి.