మీ తల పోయిందా? పీటర్సన్ తల వీడియో వైరల్  - MicTv.in - Telugu News
mictv telugu

మీ తల పోయిందా? పీటర్సన్ తల వీడియో వైరల్ 

May 22, 2020

Watch: Kevin Pietersen Loses His Head During Lockdown In Latest TikTok Video

ఇటీవల తెలుగు సినిమా పాటలతో, డైలాగులతో వరుస టిక్‌టాక్ వీడియోల చేస్తూ ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన బాటలోకి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ కెవిన్ పీటర్సన్ టిక్‌టాక్‌లో వెరైటీ వీడియోలతో ఊపేస్తున్నాడు. ఏఆర్ రెహమాన్‌ సంగీతం అందించిన ‘జెంటిల్‌మేన్’ చిత్రంలోని ‘ఒట్టగత్తి కట్టికో..’ అనే పాటకు ఇటీవల పీటర్సన్ టిక్‌టాక్‌ చేశాడు. ఈ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పీటర్సన్ పోస్ట్ చేశాడు​. మెట్ల మీదకు నడుచుకుంటూ వెళ్లిన పీటర్సన్ అక్కడే ఆగిపోయాడు. తల మాత్రం మొండెం నుంచి వేరు చేసిన విధంగా.. తల మెట్ల మీద నుంచి జారిపోతున్నట్టుగా వీడియోలో కనిపించింది. 

మిగిలిన శరీరమంతా అలాగే మెట్ల మీదే ఉంది. లాక్​డౌన్​లో ఎవరైనా తమ తలను పోగొట్టుకున్నారా?’ అని కామెంట్ చేస్తూ ఈ వీడియోను పోస్ట్​ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. నెటిజన్లను విపరీతంగా అలరిస్తోంది. ఆ వీడియోలో ఓ ట్రిక్​ ప్రదర్శించి నెటిజన్లను ఆకట్టుకోవడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇది కొంత భయాన్ని కలిగించినా.. కరోనాతో జాగ్రత్తగా ఉండాలంటూ సందేశాన్ని ఇచ్చిందంటున్నారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ప్రజలు ఇళ్లకే పరిమితం అయిన విషయం తెలిసిందే. ఎప్పుడు చూసినా బిజీగా ఉన్న సినీ, క్రీడా సెలబ్రిటీలకు ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బోర్ కొడుతోంది. అందుకే వెరైటీ పనులు చేస్తూ వీడియోలు చేసి తమ అభిమానులను పలకరిస్తున్నారు.