Watch: Lion bites off zookeeper's finger after he sticks his hand into the cage
mictv telugu

సింహం నోట్లో పెట్టాడు.. వయెలెంట్‌గా ఊడబీకింది..

June 9, 2022

Watch: Lion bites off zookeeper's finger after he sticks his hand into the cage

జూ లో ఉన్నా.. సింహం జంతువులాగే ప్రవర్తిస్తుంది. జమైకాలో జరిగిన ఈ ఘటనకి సంబంధించిన వీడియో చూస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమా డైలాగ్ గుర్తుకు రాక మానదు. జమైకాలోని సెయింట్ ఎలిజబెత్ లో ఉన్న జూలో రెండు వారాల క్రితం జరిగిందీ ఘటన. ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది

బోనులో ఉన్న సింహాన్ని జూ కీపర్ ఒక్కసారిగా రెచ్చగొట్టాడు. దాని నోట్లో వేళ్లు పెట్టి కెలికాడు. పదే పదే దానిని టీజ్ చేశాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ సింహం.. అతడి వేలును హఠాత్తుగా నోటిలోకి లాక్కుంది. అక్కడ వీడియోలు తీసుకుంటున్న పర్యాటకులు ఇదంతా జోకేమో అనుకున్నారు. కానీ, ఆ జూ కీపర్ మాత్రం వేలిని వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేశాడు. కొంత సేపటి తర్వాత వేలిని బలంగా లాగడంతో ఆ వ్యక్తి వేలు తెగిపోయింది. ప్రాణపాయ స్థితి నుంచి తప్పించుకున్నాడు. కానీ తన వేలిని పోగొట్టుకున్నాడు. ఈ చిన్న గాయంతో బయట పడడంతో అక్కడే ఉన్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. సింహాన్ని ఇబ్బంది పెట్టినందుకు చాలా మంది ఆ జూ కీపర్‌ని మందలించారు.