ఈ యువ ఎంపీల డాన్స్ అదరహో..  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ యువ ఎంపీల డాన్స్ అదరహో.. 

September 19, 2019

తృణమూల్‌ కాంగ్రెస్‌ యువ ఎంపీలు నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలు మరో సంచలనానికి తెరలేపారు. పశ్చిమ బెంగాల్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలిసిందే. బెంగాల్‌ ప్రజలందరూ దుర్గా పూజ కోసం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దుర్గా పూజ ఉత్సవాల ప్రధాన్యతను తెలిపే థీమ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. అయితే ఈ సాంగ్‌ ప్రత్యేకత ఏంటంటే నుస్రత్‌ జహాన్‌, మిమి చక్రవర్తి నటించారు. టీఎంటీ బార్‌ కంపెనీ విడుదల చేసిన ఈ పాటలో ఇద్దరు ఎంపీలు దుర్గా మాతను పూజిస్తూ చిందుల వేశారు. వీరితో పాటు మరో ప్రసిద్ధ బెంగాలీ నటి శుభశ్రీ గంగూలి కూడా డాన్స్ చేశారు. ‘ఆషే మా దుర్గా షే’ టైటిల్‌తో ఉన్న ఈ పాటకు ఇంద్రదీప్‌ దాస్‌ గుప్తా సంగీతం అందించారు. బాబా యాదవ్‌ కొరియోగ్రాఫ్‌ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లోనే ఈ పాట ఇప్పటికే 1.5 మిలియన్‌ వ్యూస్‌‌ను దాటింది.

కాగా, సంచలనాలతో పాటు వివాదాలకు మారు పేరుగా నుస్రత్, మిమి చక్రవర్తిలు నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. సినిమా రంగం నుంచి వచ్చిన వీరు అతి చిన్న వయసులోనే పార్లమెంటుకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ప్రతి నిత్యం ఏదో ఓ వార్తతో వీరు మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. నుస్రత్‌ జహాన్‌ ముస్లిం అయినప్పటికీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆమె హిందూ సంప్రదాయ పద్దతిలో నుదుట సింధూరం, చీర ధరించి హాజరయ్యారు. అప్పుడు అనేక విమర్శలు ఎదుర్కున్నారు. అయితే తనను విమర్శించే వారిని పెద్దగా పట్టించుకోనని నుస్రత్‌ అన్న విషయం తెలిసిందే.