Watch: Mamata Banerjee dances with folk artists at Independence Day event in Kolkata
mictv telugu

జాన‌ప‌ద క‌ళాకారుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన సీఎం మమ‌తా బెన‌ర్జీ

August 15, 2022

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం కోల్‌కతాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్నారు. జానపద కళాకారులతో కలసి డ్యాన్స్ చేశారు. ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ కనిపించే మమతా బెనర్జీ ఇలా స్టెప్పులు వేయడం అందరిని అబ్బురపరిచింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

మ‌న వార‌స‌త్వ ఫ‌లాల‌ను ఆకాంక్ష‌ల‌ను ముందు త‌రాల వారికి అందించేందుకు మ‌నం పున‌రంకితం కావాల‌ని అన్నారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు చెబుతూ మ‌మ‌తా బెనర్జీ ట్వీట్ చేశారు. సీఎం జాన‌ప‌ద క‌ళాకారుల బృందంతో నృత్యం చేస్తున్న స‌మ‌యంలో అక్క‌డున్న వారంతా లేచి నిల్చుని అభినంద‌న‌లు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌మ‌తా బెన‌ర్జీ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించి ..రాష్ట్ర పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. 75 ఏండ్ల స్వాతంత్ర్య వ‌జ్రోత్స‌వ వేళ స్వాతంత్ర్య స్ఫూర్తితో భార‌త్ జాగృతం కావాల‌ని ఆమె పిలుపు ఇచ్చారు.