Watch: Minister Anurag Thakur Pushes Bus That Broke Down In Himachal Village
mictv telugu

నడిరోడ్డుపై ఆగిన బస్సు.. ఓ చెయ్యేసిన కేంద్ర మంత్రి

November 9, 2022

నడిరోడ్డుపై ఆగిపోయి న బస్సును ప్రయాణికులతో కలిసి నెట్టారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లోని ఓ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఇంతలో ఆయన కాన్వాయ్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో కారణమేంటో తెలుసుకునేందుకు కారు దిగి చూశారు. ఓ బస్సు నడిరోడ్డుపై ఆగిపోయి ఉండడం, దానిని స్టార్ట్ చేయడానికి డ్రైవర్ పడుతున్న ఇబ్బంది చూసి స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు.

మరికొంత మంది ప్రయాణికులతో కలిసి కేంద్ర మంత్రి ఆ బస్సును నెట్టారు. దీంతో ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన వాహనాలు ముందుకు కదిలాయి. , ఆపై జామ్ క్లియర్ అయిన తర్వాత తదుపరి ప్రచారానికి బయలుదేరాడు. అంతకుముందు రోజు, సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే బిజెపి ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని మెటల్ రోడ్లతో అనుసంధానం చేస్తుందని చెప్పారు. అయితే ఇదంతా ఎన్నికల జిమ్మిక్కేనని అంటున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు. అంతగా సాయం చేయాలనుకుంటే తన కాన్వాయ్ వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి చెప్పొచ్చు కదా అని కొందరు అంటుంటే.. కాంగ్రెస్, ఆప్ నేతలు కూడా ఎన్నికల్లో గెలవాలంటే ఈ ట్రిక్ ను వాడండి అని మరికొందరు అంటున్నారు. ఈ నెల 12 వ తేదిన హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ కీలక నేతలు ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, హామీలు ఇస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు డిసెంబరు 8న వెల్లడవుతాయి.