Watch PM Modi's reaction to Korean Embassy staff dancing Natu Natu
mictv telugu

korean embassy : నాటునాటు పాటపై కొరియా ఎంబసీ సిబ్బంది డ్యాన్స్…మోదీ ఏమన్నారో తెలుసా..?

February 26, 2023

 

Watch PM Modi's reaction to Korean Embassy staff dancing Natu Natu

సంచనాల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్‌కి కూడా నామినేట్ అయింది. ఈ పాటకు వరల్డ్ వైడ్ ప్రేక్షకుల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోతోంది. తాజాగా ఈ పాటపై కొరియా ఎంబసీ సిబ్బంది డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరియన్ ఎంబసీ సిబ్బంది చేసిన డ్యాన్స్ పై ప్రధాని మోదీ స్పందించారు.

ఈ వీడియోను భారతదేశంలోని కొరియా రాయబార కార్యాలయం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో కొరియా రాయబారి చాంగ్ జే బోక్‌తో పాటు ఎంబసీలో పనిచేస్తున్న సిబ్బంది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను కొరియా రాయబార కార్యాలయం ట్విట్టర్ లో షేర్ చేసింది. ‘మీకు నాటు తెలుసా? ‘నాటు నాటు’ డ్యాన్స్ కవర్‌ను పంచుకోవడం మాకు సంతోషంగా ఉందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ పాటలో కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే బోక్‌తో కలిసి మొత్తం సిబ్బంది చేసిన డ్యాన్స్ చేశారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇఫ్పుడు ప్రధాని మోదీ కూడా ట్విట్టర్ లో ఈవీడియోను షేర్ చేశారు. మీ డ్యాన్స్ ప్రయత్నం బాగుంది..అందర్నీ ఆకట్టుకుంటుంది అంటూ రాశారు. అంతకుముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న నాటు-నాటును అభినందించారు. అంతే కాకుండా కొరియన్ ఎంబసీ సిబ్బంది నృత్య నైపుణ్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఒక నెటిజన్ ఇలా వ్రాశారు, ‘నిజంగా అద్భుతమైన ప్రదర్శన., ‘డాన్స్ అద్భుతంగా ఉంది అంటూ మరోకరు కామెంట్ చేశారు.