కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల భారత్ జోడో యాత్రతో బిజీబిజీగా గడిపిన రాహుల్.. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని గుల్మార్గ్‌లో సేదతీరుతున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కశ్మీర్ వెళ్లారు రాహుల్. ఈ సందర్భంగా అక్కడ మంచుపై స్కీయింగ్ చేస్తూ అక్కడి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వ్యాలీలో జరిగే ప్రైవేట్ ఫంక్షన్‌కోసం రాహుల్ అక్కడికి వెళ్లారని పార్టీకి చెందిన పలువురు నేతలు తెలిపారు.
ఉత్తర కాశ్మీర్‌లో రాహుల్ గాంధీ గుల్‌మార్గ్ స్కీయింగ్ రిసార్ట్‌కు వెళుతుండగా తంగ్‌మార్గ్ పట్టణంలో కొద్దిసేపు ఆగినప్పుడు ఆయన ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఆ సమయంలో ఆయనను మీడియా చుట్టుముట్టి… కొన్ని ప్రశ్నలు అడిగేందుకు ప్రయత్నించగా.. ఆయన సమాధానాలు చెప్పడానికి నిరాకరించారు. కేవలం నమస్కారం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా…. అక్కడకు వచ్చిన కొందరు పర్యాటకులతో మాత్రం ఆయన సరదాగా సెల్ఫీలు దిగారు.
As a reward, Rahul Ji treating himself to a perfect vacation in Gulmarg after successful #BharatJodoYatra.#RahulGandhi@RahulGandhi pic.twitter.com/DDHCDluwCC
— Farhat Naik (@Farhat_naik_) February 15, 2023
గత నెలలో, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రను 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో 4 వేల కిలోమీటర్లు నడిచారు. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఈ పర్సనల్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ స్కీయింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.