ఆర్జీవీ 'క్లైమాక్స్' చూడాలంటే రూ.100 కొట్టాల్సిందే - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్జీవీ ‘క్లైమాక్స్’ చూడాలంటే రూ.100 కొట్టాల్సిందే

May 29, 2020

mia malkova.

దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘జీఎస్టీ’ షార్ట్ ఫిలింతో అడల్ట్ చిత్రాలు కూడా తీయగలడని నిరూపించుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ‘క్లైమాక్స్’ పేరుతొ మరో సెమి పోర్న్ మూవీ వర్మ తెరకెక్కించాడు. ఇటీవల దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేయగా.. మంచి స్పందన లభిస్తోంది. ఇందులో ‘జీఎస్టీ’ లో నటించిన పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో వర్మ అంగాంగ ప్రదర్శన చేయించాడు. ఎడారిలో మియా, ఆమ ప్రియుడు తమదే లోకమంతా అన్నట్లు కనిపిస్తున్నారు. 

ఒయాసిస్సు వద్ద వీరు ప్రేమాయణంలో ఉండగా బందిపోటు దొంగలు రావడం, మియా ప్రియుణ్ని పట్టుకెళ్లడం, చేజింగ్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రియుణ్ని కోల్పోయిన మియా ఒంటరిగా ఎడారుల్లో తిరుగుతోంది. అన్ని రసాలు దట్టించి వదిలిన ‘క్లమాక్స్’ ట్రైలర్ ను చూసిన యువత ఫిదా అవుతోంది. ఈ సినిమాను వర్మ ‘శ్రేయాస్ ఈటీ’ అనే యాప్ లో మే 30 సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నాడు. ఈ సినిమాను చూడాలంటే ఒక వ్యూస్ కు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని వర్మ తెలిపాడు.