రిషబ్ పంత్ ప్రమాదం ఒళ్లు గగుర్పొడుస్తోంది. అతి వేగంతో రెయిలింగ్‌ను ఢీ కొన్న పంత్ కారు క్షణాల్లో అగ్నికి ఆహుతి అయ్యింది. తాజాగా ప్రమాదానికి సంబంధించిన సీసీఫుటేజ్ బయటకు వచ్చింది. ఈ వీడియో ప్రమాద దృశ్యాలు స్పష్టం కనిపిస్తున్నాయి. వేగంగా దూసుకు వచ్చిన పంత్ మెర్సిడెస్ బెంజ్ కారు బలంగా రోడ్డు మధ్యలో ఉన్న రెయిలింగ్ ఢీ కొట్టినట్లు కనిపిస్తుంది. వెంటనే కారు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.
అయితే కొన్ని సెకన్ల ముందే పంత్ కారు నుంచి బయటకు దూకేయడంతో ప్రాణాలు రక్షించుకున్నాడు. ఈ ఘటనలో కారు కూర్తిగా కాలిపోయింది. పంత్ ఢిల్లీ నుంచి రూర్కి వస్తుండగా కాసేపట్లో ఇంటికి చేరుకుంటాడనే సమయంలో ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారును పంత్ స్వయంగా డ్రైవ్ చేస్తున్నాడు. తెల్లవారుజామున కావడంతో నిద్రమత్తులో ఉండటం వల్లే కారు అదుపుతప్పి ఉండొచ్చని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ అనుమానిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
న్యూ ఇయర్ ఆంక్షలు.. హైదరాబాదీలు తెలుసుకోవాల్సినవి..
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్..మరో 30 స్పెషల్ ట్రైన్స్…
నన్ను కోవర్ట్ అన్న కాంగ్రెస్సోడిని చెప్పుతో కొడతా…..ఎమ్మెల్యే జగ్గారెడ్డి విశ్వరూపం