రా రమ్మంటున్న జలధారలు..! - MicTv.in - Telugu News
mictv telugu

రా రమ్మంటున్న జలధారలు..!

July 24, 2017

వరుణుడు వర్షించెను..పుడమితల్లి పులకరించింది.జలధారలు పరవశించిపోయాయి. ఎత్తైన కొండల నుంచి జాలువారుతున్నాయి. చూడచక్కని జలసిరులు చూపులు తిప్పుకోకుండా రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి. తుంపర్లే ఆహ్వానాలుగా నడిచి వస్తున్నాయి. అక్కడిక్కెళ్లిన పర్యాటకుల మదిని దోచేస్తున్నాయి. ఈ జలధారల సవ్వడులు ఎక్కడో తెలుసో…

పచ్చని ప్రకృతి అందాలు…గలగల పారే జలపాతాలు..జోరు వానలకు కొత్త అందాలు అద్దుకున్నాయి. తెలంగాణాలోని నయాగరాలు గారాలు పోతూ , పరవళ్లు తొక్కుతూ పర్యాటకుల్ని ఆహ్వానిస్తున్నాయి. ఆదిలాబాద్‌, భూపాలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని కుంటాల, బొగత, పొచ్చర.. ఇలా ఎన్నో జలపాతాలు పరవశింపజేస్తున్నాయి.

జోరువానలకు జలపాతాలన్నీ కొత్తందాలు సంతరించుకున్నాయి. దారిపొడవునా చెట్లన్నీ చిగురించి ఆహ్లాదపరుస్తున్నాయి. తెలంగాణలోని అతిపెద్ద జలపాతం కుంటాల హొయలు చూపరులను కట్టిపడేస్తుంది. ఏడాదంతా జలధార భీమునిపాదం చూపరుల్ని ఆకట్టుకుంటోంది.

తెలంగాణ నయాగరా బొగత జలపాత. దట్టమైన సీకుపల్లి వాగు ఎగువ ప్రాంతంలో ఏర్పడిన బొగత… 100 అడుగుల ఎత్తు నుంచి నీటి ధారలు కిందకి దూకుతుంటాయి. ఇక్కడి జలపాతం 365 రోజులు ఉంటుంది. వేసవిలో ప్రవాహం కొంత తగ్గుతుంది.ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న గాయత్రి జలపాతం అవకాశమిస్తుంది. ఇక కనకాయి జలపాతం పర్యాటకులకు తెగ అట్రాక్ట్ చేస్తోంది.. అక్కడి అటవీ ప్రాంతంలో వనభోజనాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఇక్కడున్న ఆలయంలో ఉన్న బంగారు కనకదుర్గ విగ్రహం హైలైట్.

మొత్తానికి వానజల్లుకు తెలంగాణ నయాగరాలు కొత్త అందాల్ని పరుచుకున్నాయి. పర్యాటకుల్ని రా రమ్మని ఆహ్వానిస్తున్నాయి.