కృష్ణా నదిలో వరదనీటి ఉధృతి పెరగడంతో ప్రకాశం బ్యారేజీ నిండుకుండలా మారింది. ఎగువన పులిచింతల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ కు వరద ప్రవాహం పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్నానఘట్టాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. నదికి ఇరువైపులా పోలీసు పికెటింగ్ ఏర్పాట్లు చేశారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4.44లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కృష్ణలంక, భూపేష్ గుప్తా కాలనీ, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజీ ఇన్ ఫ్లో మరియు ఔట్ ఫ్లో 3.37 క్యూసెక్కులుగా వుంది.