Water on Gehlot's hopes..twisted leadership!
mictv telugu

గెహ్లట్ ఆశలపై నీళ్లు..మెలికపెట్టిన అధిష్టానం!

September 22, 2022

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించి, నేడు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ విడుదల చేశారు. ఈ అధ్యక్ష పదవి కోసం..రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సీనియర్ నేత శశిథరూర్ పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం అశోక్ గెహ్లాట్‌కు ఓ బిగ్‌షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఒక వ్యక్తికి, ఒకే పదవి అనే విషయాన్ని అశోక్ గెహ్లాట్‌కు సోనిమా గాంధీ గుర్తు చేసినట్లు సమాచారం.

రాజస్థాన్ సీఎంగా కొనసాగుతున్న అశోక్ గెహ్లాట్ గతకొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్దమైయ్యారు. అందుకోసం పదే పదే ఢిల్లీకి వెళ్లి, సోనియా గాంధీతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో గురువారం అధ్యక్ష పదవికి సంబంధించి, అధిష్టానం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే, గతంలో కాంగ్రెస్.. ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన చింతన్ శిబిర్‌ సభలో ‘ఒకే వ్యక్తికి, ఓకే పదవి’ అనే నిర్ణయం తీసుకుంది. తాజాగా గెహ్లట్‌ సోనియా గాంధీని కలవగా,ఆమె ఇదే విషయాన్ని ఆయనకు స్పష్టం చేయడంతో గ్లెహట్ ఆశలకు నీరు చలినట్లు అయ్యిందని ఆయా పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు.

మరోవైపు సచిన్ పైలట్‌కు రాజస్థాన్ సీఎం పగ్గాలు అప్పగించడం కోసమే, వ్యూహాత్మకంగా గెహ్లట్‌కు ఏఐసీసీ పగ్గాలు అప్పగించాలని సోనియా గాంధీ, రాహుల్ నిర్ణయించారనే భావన సైతం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం గెహ్లట్ ముఖ్యమంత్రి పదవిని వదులుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.