వాటర్ ట్యాంక్‌పై ప్రియురాలు.. ప్రియుడు పరార్.. - MicTv.in - Telugu News
mictv telugu

వాటర్ ట్యాంక్‌పై ప్రియురాలు.. ప్రియుడు పరార్..

June 13, 2019

తనలాంటి దుస్థితి మరే ఆడపిల్లకూే రాకూడదని.. ప్రియుడు మోసం చేసిన ఓ ప్రియురాలు వాటర్ ట్యాంక్ ఎక్కింది. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటాననడంతో  జీవితం చాలించాలనుకుంది. అతడు తనను పెళ్లి చేసుకునేదాకా..అక్కడి నుంచి దిగనంటూ ఆందోళనకు దిగింది. పోలీసులు, కుటుంబీకులు, బంధువులు ఆమెకు నచ్చజెప్పి కిందకు దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన పెద్దపల్లి మండలం అప్పన్నపేటలో చోటు చేసుకుంది. 18 ఏళ్ల దామ అనూష, అనవేన శ్రీకాంత్‌లు గత రెండేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు.

వీరి ప్రేమ వ్యవహారం తెలిసి అనూష ఇంట్లో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దీంతో అనూష తనను పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే శ్రీకాంత్ అనూహ్యంగా మాట మార్చాడు. ఆమెతో పెళ్లికి నిరాకరించాడు. వేరే యువతిని పెళ్లికి సిద్ధపడ్డాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన యువతి ఆత్మహత్య చేసుకుంటానని గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కింది. గ్రామస్తులు, పోలీసులు అక్కడికి చేరుకుని అనూషను క్రిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

తనను శ్రీకాంత్ ప్రేమించినట్టు నటించి జాతర్లకు, సినిమాలకు తిప్పాడని చెప్పింది. తన ఏటీఎం కార్డుతో చాలా సార్లు డబ్బులు తీసుకున్నాడని వివరించింది. తనకు న్యాయం జరిగేవరకు ట్యాంక్ పై నుంచి దిగనంది. తను, శ్రీకాంత్ కలిసి దిగిన ఫోటోలు కావాలని ఊరి పెద్దలు అడుగుతున్నారని.. తనవద్ద పెద్ద ఫోన్ లేదని.. శ్రీకాంత్ ఫోన్‌లో తామిద్దరివి ఫోటోలు, వీడియోలు వున్నాయని తెలిపింది. పరారీలో వున్న శ్రీకాంత్‌ను పోలీసులు గాలిస్తున్నారు.