Waterfalls Appear In California's Death Valley
mictv telugu

ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతంలో పుట్టిన జలపాతం.. వీడియో

September 13, 2022

అత్యంత వేడి ప్రాంతంలో జలపాతం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏదైనా సాధ్యమేనని ఈ విషయం నిరూపిస్తోంది. అమెరికాలోని కాలిఫోర్మియా – నెవడా సరిహద్దు ప్రదేశం ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతం, అత్యంత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతంగా రికార్డులకెక్కింది. అలాంటి చోట హఠాత్తుగా కురిసిన భారీ వర్షాల వల్ల శనివారం మధ్యాహ్నం ఏకంగా ఓ జలపాతమే ఏర్పడింది. ఇక్కడ ఉష్ణోగ్రత 56 డిగ్రీలు ఉండగా, వర్షపాతం ఏడాదికి 2 అంగుళాలు మాత్రమే. అలాంటి ఎడారి ప్రదేశంలో చూద్దామంటే ఒక్క మొక్క కూడా కనిపించదు. కానీ, ఆగస్టులో వచ్చిన హరికేన్ కే తుఫాను వల్ల వరద ఉప్పొంగింది. ఆ సమయంలో పలువురు పర్యాటకులు చిక్కుకుపోగా వారి వాహనాలు బురద నీటిలో మునిగిపోయాయి. ఆ దృష్యాలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవగా, ఇప్పుడు ఏకంగా జలపాతమే ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోను న్యూస్ వీక్ అనే పత్రిక సేకరించి ప్రపంచానికి తెలియజేసింది. పూర్తిగా ఎండిపోయిన కొండల నుంచి నీరు జాలువారగా కిందకు ప్రవహిస్తున్న దృష్యం సోషల్ మీడియాలో చూపరులను ఆకట్టుకుంటోంది. కాగా, తుఫానులు, హీట్ వేవ్‌లు, అడవి మంటలు, కరువులు, వడగళ్ల వానలు వంటి తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల ఇలాంటివి జరుగుతాయని అక్కడి ప్రభుత్వ వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు.