‘అగ్నిపథ్’ కాకుండా సైన్యంలో చేరే మార్గాలు ఇవీ - MicTv.in - Telugu News
mictv telugu

‘అగ్నిపథ్’ కాకుండా సైన్యంలో చేరే మార్గాలు ఇవీ

June 23, 2022

కేంద్రం ఇటీవల అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై అప్పటికే ఆర్మీ జాబులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. అగ్నిపథ్‌లో జాయిన్ అయినా నాలుగేళ్ల తర్వాత తమ పరిస్థితి ఏంటని చాలా మంది ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ ద్వారా కాకుండా శాశ్వతంగా సైన్యంలో పనిచేయడానికి అందుబాటులో ఉన్న అవకాశాల గురించి తెలుసుకుందాం. ఎన్డీఏ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ ద్వారా 16 – 19 వయసు వారు ఆర్మీలో చేరవచ్చు. 12వ తరగతిలో ఫిజిక్స్, కెమెస్ట్రీ చదివిన వారు దీనికి అర్హులు. యూపీఎస్పీ వారు పరీక్షను నిర్వహిస్తారు.

సీడీఎస్ : డిగ్రీ పూర్తి చేసి ఆర్మీలో చేరాలనుకునే వారు సీడీఎస్ ద్వారా చేరవచ్చు. గరిష్ట వయస్సు 24 కాగా, విభాగాన్ని బట్టి వయసు సడలింపు ఉంటుంది. వైమానిక దళంలో అవకాశాలు : ఇందులో చేరడానికి ఏఎఫ్సీఏటీ ద్వారా 20 – 24 వయసు వారు అర్హులు. పైలెట్ లైసెన్స్ ఉంటే 26 ఏళ్ల వారు కూడా అర్హులవుతారు. 12వ తరగతిలో మ్యాథ్స్, ఫిజిక్స్‌లలో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. టెరిటోరియల్ ఆర్మీ: వయోపరిమితి దాటిన వారు ఇందులో చేరవచ్చు. ఇవి కాకుండా ఎన్‌సీసీ, గాగ్, టీడీఎస్, టీఈఎస్ వంటి మార్గాల ద్వారా ఆర్మీలో జాయిన్ అవ్వవచ్చు. కాబట్టి అగ్నిపథ్‌లో చేరడానికి ఆసక్తి లేని వారు నిరాశ పడాల్సిన అవసరం లేదు.