మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో మూత్రం తాగించారు - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రాలు చేస్తున్నారన్న నెపంతో మూత్రం తాగించారు

May 27, 2022

మూడనమ్మకాల పట్ల ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా దేశంలో ఎక్కడో చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముర్షీదాబాద్ జిల్లాలో అలాంటి అమానవీయ ఘటనే జరిగింది. రఘునాథ్గంజ్ ప్రాంతంలోని మథురాపుర్లో చేతబడి చేస్తున్నారనే నెపంతో ఓ కుటుంబాన్ని చితకబాదారు స్థానికులు. అనంతరం వారి చేత మూత్రం తాగించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారడం వల్ల పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

అంతకుముందు.. గురువారం ఉదయం కూడా ఇటువంటి ఘటనే వెలుగుచూసింది. దక్షిణ్ దినాజ్పుర్ జిల్లాకు చెందిన లక్ష్మీరామ్ హెమ్బ్రమ్ అనే వ్యక్తిని చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో పలువురు దుండగులు హత్య చేశారు. అనారోగ్యం వల్ల ఎక్కువ కాలం బతకలేకపోవచ్చని పక్కింట్లో ఉండే ఫాగు బస్కే అనే వ్యక్తికి జోస్యం చెప్పడమే ఇందుకు కారణం. ఆ జోస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఫాగు బస్కే కొడుకు.. తన తండ్రి చావుకి హెమ్‌బ్రమ్ చేతబడే కారణమని అనుమానంతో మరికొందరితో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు.