పాఠం నేర్చుకుంటా - రాహుల్‌గాంధీ ట్వీట్ - MicTv.in - Telugu News
mictv telugu

పాఠం నేర్చుకుంటా – రాహుల్‌గాంధీ ట్వీట్

March 10, 2022

 22

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎదురైన దారుణ ఫలితాలపై ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రజా తీర్పును అంగీకరిస్తున్నాం. గెలిచిన వారికి నా అభినందనలు. కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు. ఫలితాలను విశ్లేషించుకుంటాం. ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి పార్టీ పునర్ వైభవానికి కృషి చేస్తాము. దేశ హితం కోరి పని చేస్తామ’ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు ఇందిరా గాంధీ పోలికలున్న ప్రియాంకా గాంధీ యూపీలో ఏమాత్రం ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ పార్టీ ట్రంప్ కార్డుగా ఇన్నాళ్లు భావించిన ఆమె ఎన్నికల్లో తేలిపోవడంతో కాంగ్రెస్ నేతలు నిరాశలో మునిగిపోయారు.