MLC Kavitha : నిజామాబాద్‎లో ఎయిర్ పోర్టు, ఐటీ హబ్‎ అంశాన్ని పరిశీలిస్తున్నాం.. - MicTv.in - Telugu News
mictv telugu

MLC Kavitha : నిజామాబాద్‎లో ఎయిర్ పోర్టు, ఐటీ హబ్‎ అంశాన్ని పరిశీలిస్తున్నాం..

March 5, 2023

త్వరలోనే నిజామాబాద్ లో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామన్నారు ఎమ్మెల్సీ కవిత. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్ లు స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తాయన్నారు. రూ. 50కోట్ల మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్న నిజామాబాద్ ఐటీ హబ్ ద్వారా ప్రత్యక్షంగా 750మంది యువతకు, పరోక్షంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, పార్టీ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ మహేశ్ బిగాలతో కలిసి కవిత శనివారం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని ఐటీ హబ్ భవనాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఐటీ హబ్ నిజామాబాద్ వెబ్ సైట్ ను ప్రారంభించారు. పరిశ్రమ అభివ్రుద్ధికి ఐటీ హబ్ నాంది అని ఎమ్మెల్సీ కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.

జిల్లా యువతకు ఉపాధి కల్పించేందుకు నిజామాబాద్ కు పరిశ్రమలు వస్తాయని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. త్వరలోనే మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. కాగా జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నామని కవిత చెప్పారు.