55 స్థానాల్లో పోటీకి సిద్ధం.. సీపీఐ - MicTv.in - Telugu News
mictv telugu

55 స్థానాల్లో పోటీకి సిద్ధం.. సీపీఐ

March 14, 2019

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ 26 రాష్ట్రాల్లో మొత్తం 55 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పోటీ చేసే అభ్యర్థులను కూడా ఎంపిక చేశామని  తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ పార్టీలను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. వామపక్ష పార్టీలు గెలుస్తే అవసరమైన చట్టాలు అమలు అవుతాయని అన్నారు.

కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై సురవరం అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ పార్లమెంటు ఎన్నికలు జరిపినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహింట్లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ కు మద్ధతు తెలుపుతున్నాయని మోదీ చేస్తున్న ప్రచారం అవాస్తవమని సురవరం అన్నారు. ఈ సందర్భంగా సీపీఐ తెలంగాణ నేత  చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్షాలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.