మాబావ నేను మంచిగనే ఉన్నం..! - MicTv.in - Telugu News
mictv telugu

మాబావ నేను మంచిగనే ఉన్నం..!

August 9, 2017

హరీష్‌రావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అన్ని విషయాలలోనూ మాబావకు నాకు..ఇద్దరికీ క్లారిటీ ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నేరెళ్ల ఘటనతో పాటు వివిద సమకాలిన అంశాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.జర్నలిస్టులు అడిగిన ప్రతి ప్రశ్నకు ఎంతో చాకచక్యంతో సమాధానమిచ్చారు.నేరెళ్ళలో ఇసుక లారీల ప్రమాదం నిజమేనని ఆయన అంగీకరించారు. బాధితులు కూడా ఆవేశంలో లారీలు తగులబెట్టారన్నారు. బాధితులను పోలీసులు అరెస్టు చేయడం, కస్టడీకి తీసుకోవడం తనకు తెలియదన్నారు. రిమాండ్ తిరస్కరించిన తరువాత సమస్య బయటపడిందన్నారు.నేరెళ్ళ బాధితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవసరం ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు.ఇసుక రవాణాను కేవలం దందాగా చూడాలని అంతేకానీ ఇసుక మాఫియా అంటే సహించేది లేదని అన్నారు.

తాము ఉద్యమం నుంచి వచ్చామని, కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలని, ప్రజల్లో ఉండాలని కోరుకుంటామన్నారు. నేరెళ్ల ఘటనలో పోలీసుల అత్యుత్సాహం ఉందన్నారు. నేరెళ్లకు రోజుకో ప్రతిపక్షం వెళ్తోందని, అందుకే ఆలస్యంగా వెళ్లానని కేటీఆర్ చెప్పారు. డిఐజి నివేదిక రాగానే కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. ఈ కేసును దళితలపై దాడిగా చూడవద్దన్నారు

తెలంగాణ‌లో 2019 ఎన్నిక‌ల్లోనూ అధికారం టీఆర్ఎస్‌ పార్టీదే అని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీలో ఇప్పుడున్న ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవడమే కష్టం అని, అయితే హైదరాబాద్‌‌లో మాత్రం బీజేపీనే ప్రతిపక్షం అన్నారు. రాజధానిలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాదంటూ కేటీఆర్ జోస్యం చెప్పారు. తెలంగాణలో టీడీపీ, వామపక్షాల ఊసే లేదని, సింహం సింగిల్‌‌గానే ఉంటుందన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి అందరూ తమకు రాజకీయ శత్రువులే అన్నారు.అన్నింటికి దొర్కింది గదా సందు అని మేమేదో తప్పుచేసినట్టు ఒకవిషయాన్ని పట్టుకుని  సాగదీస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చెయ్యడం ప్రతిపక్షాలకు తగదని అన్నారు.

అయితే  జర్నలిస్టులతో జరిగిన చిట్ చాట్ లో.. ప్రశ్నలు సమాధానాలకంటే ఎక్కో  సెల్ఫీల ఘటన చోటుచేసుకుంది.జర్నలిస్టులందరు కేటీఆర్ తో సెల్ఫీలు దిగడానికి అత్యుత్సాహం చూపడం చిట్ చాట్ లో కొసమెరుపు.