131 కేసులను ఎత్తివేస్తున్నాం: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

131 కేసులను ఎత్తివేస్తున్నాం: జగన్

April 21, 2022

gajan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గురువారం సంచలన ప్రకటన చేశారు. గ్రాసిమ్‌ ప్రాజెక్టు సంబంధించి జరిగిన ఆందోళనల్లో 131 మందిపై ఉన్న కేసులను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా ఈరోజే దానికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేస్తున్నామని అన్నారు. గతంలో బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఉన్న గ్రాసిమ్‌ ప్రాజెక్టు విషయంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు భారీ ఎత్తున జరిగిన విషయం తెలిసిందే. ఆ ఆందోళనలో భాగంగా చాలామంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి, కేసులు నమోదు చేశారు. అయితే, ఇంకా 131 మందిపై కేసులు ఉన్నాయి. వాటిని ఎత్తివేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జగన్ మోహన్ రెడ్డి గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను ప్రారంభించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. ”గ్రాసిమ్‌ పరిశ్రమతో ప్రత్యక్షంగా 1300 మంది, పరోక్షంగా 1150 మందికి ఉపాధి కలుగుతుంది. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా చట్టం చేశాం. ఎన్నికలకు 2 నెలల ముందు గత ప్రభుత్వం గ్రాసిమ్‌ సంస్థకు ప్రాజెక్ట్‌ అప్పగించింది. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కాకుండా సంతకాలు చేసింది. అన్ని సమస్యలు పరిష్కరించి కంపెనీ పనులు ముందుకు సాగేలా చేశామన్నారు. అవరోధాలను ఒక్కొక్కటికీ తొలగించి ప్రాజెక్టు నెలకొల్పామన్నారు. భూగర్భ జలాలు కాలుష్యం కాకుండా ఆధునిక సాంకేతికతో పరిశ్రమ ఏర్పాటు చేశారన్నారు. టెక్నాలజీ మార్పు ద్వారా జీరో లిక్విడ్‌ వేస్ట్‌ డిశ్చార్జ్‌ చేశారన్నారు. భయాలకు తావులేకుండా ప్రాజెక్టు నెలకొల్పారని’’ వైఎస్‌ జగన్‌ అన్నారు.