మీరూ అతీతం కాదు.. సాధారణమే ! - MicTv.in - Telugu News
mictv telugu

మీరూ అతీతం కాదు.. సాధారణమే !

August 7, 2017

మీరు దేనికీ అతీతం కాదు. సాధారణ పౌరులకుండే హక్కులు, చట్టాలు మాత్రమే మీకూ వర్తిస్తాయి. అంటూ ఘాటుగా స్పందించింది ఢిల్లీ హైకోర్ట్. అయితే ఎవరి గురించో ఈ వాఖ్యానం అనేదేకదా ? మీడియా గురించి, పత్రికల గురించి, టీవీ ఛానళ్ళలో పని చేసే విలేఖర్ల గురించి. ఈ దేశ సగటు పౌరునికి హక్కులు ఈ చట్టం కల్పించిందో అవే మీడియాలో పనిచేసి వ్యక్తులకు, సంస్థలకు వర్తిస్తాయని గుర్తు చేసింది. ఎవరి మీదనైనా వ్యాఖ్యానించేటప్పుడు, విమర్శించేటప్పుడు, ఏదైనా కేసులో పరిశోధనలు చేసేటప్పుడు సాధారణ పౌరులులాగానే వ్యవహరించాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఢిల్లీకి చెందిన స్టాక్ బ్రోకర్ ఓ పత్రికపై దాఖలు చేసిన పరువు నష్టం దావా సందర్భంగా అడిషనల్ జిల్లా జడ్జ్ రాజ్ కపూర్ ఈ వ్యాఖ్యానాలు చేసారు. మీడియాకు సాధారణ పౌరునికి వుండే హక్కులు మాత్రమే వుంటాయి. కానీ బాధ్యతల విషయానికొస్తే సమాజంలో వుండే అందరికంటే జర్నలిస్టులు ఎక్కువ బాధ్యతాయుతంగా వుండాలనేది ఆ జడ్జ్ వుద్దేశంలా కనిపిస్తున్నది.