We are releasing the TET results on July 1: Minister Sabita
mictv telugu

టెట్ ఫలితాల విడుదల తేదీ ప్రకటించిన మంత్రి సబితా

June 28, 2022

ఇప్పటికే ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేసిన ప్రభుత్వం తాజాగా మరో పరీక్షా ఫలితాల వెల్లడిపై స్పష్టతనిచ్చింది. తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం కీలక విషయం వెల్లడించారు. జులై 1న ఫలితాలు ప్రకటిస్తామని ప్రకటించారు. మంగళవారం తన శాఖపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెట్ ఫలితాలను జాప్యం లేకుండా చెప్పిన సమయానికి విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.