మావల్ల కావట్లేదు.. అప్పులు ఎగ్గొడుతున్నాం : శ్రీలంక సంచలన ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

మావల్ల కావట్లేదు.. అప్పులు ఎగ్గొడుతున్నాం : శ్రీలంక సంచలన ప్రకటన

April 12, 2022

 

0010

తీవ్ర ఆహార, ఆర్ధిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంక ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విదేశీ అప్పులను ఎగ్గొడుతున్నట్టు ఆదేశ ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆ దేశానికి 5100 కోట్ల డాలర్ల (సుమారు రూ. 3.88 లక్షల కోట్లు) అప్పులున్నాయి. ఐఎంఎఫ్ నుంచి బెయిలవుట్ ప్యాకేజీ పెండింగులో ఉందని, అవి వస్తే కానీ, అప్పు కట్టలేమని పేర్కొంది. తమకు అప్పులిచ్చిన దేశాలు వడ్డీ కావాలనుకుంటే వేరే మార్గాల ద్వారా, లేదా శ్రీలంక రూపాయల్లో ఇస్తామని వివరించింది. ఇప్పుడు తమ వద్దనున్న విదేశీ మారక ద్రవ్యం అప్పు కట్టడానికి వినియోగిస్తే.. దేశంలో తిండి గింజలు దొరక్క అల్లాడిపోతామని స్పష్టం చేసింది. ఆ డాలర్లను అత్యవసర వస్తువుల దిగుమతులకు వాడతామని తేల్చిచెప్పారు. అయితే సెంట్రల్ బ్యాంకు అధికారులు మాత్రం అప్పు చెల్లించకపోవడం అనేది తాత్కాలికమేనని చెప్తున్నారు. కాగా, ప్రజలు ప్రధాని దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రధాని మహీంద్ర రాజపక్స మాత్రం అధికారం నుంచి దిగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తిరిగి రసాయన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గత రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.