చంద్రబాబు విన్నపం మేరకు ఆ పని చేశా : సీఎం జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబు విన్నపం మేరకు ఆ పని చేశా : సీఎం జగన్

April 4, 2022

ghfghb

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. కొత్త జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఆయన ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కు, రెవెన్యూ డివిజన్ల సంఖ్య 72కు చేరుకుంది. ఇందులో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు విన్నపం మేరకు, కుప్పం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేశాం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, సొంత నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసుకోలేకపోయారు. ఆయన చేయలేని పనిని మేం చేశామం’టూ వ్యాఖ్యానించారు. పాలనా వికేంద్రీకరణకు, పరిపాలనను ప్రజల వద్దకు చేర్చేందుకు జిల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు, డివిజన్లు ఈ రోజు నుంచే తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తాయని, ఉద్యోగులు కొత్త ఆఫీసుల నుంచే తమ విధులు నిర్వహిస్తామని వెల్లడించారు.