హైకోర్టు తీర్పుపై ముస్లిం యువతుల సంచలన నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

హైకోర్టు తీర్పుపై ముస్లిం యువతుల సంచలన నిర్ణయం

March 15, 2022

bhfjh

హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పిటిషన్ వేసిన యువతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు న్యాయం దక్కలేదనీ, కోర్టు తీర్పుకు నిరసనగా హిజాబ్ లేకుండా కాలేజీకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. పిటిషన్ వేసిన ఆరుగురు యువతుల్లో ముగ్గురు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. యువతులు హిజాబ్ ధరించాలి కానీ పుస్తకాలను కాదని, ఈ విషయంపై పోరాటం చేసి తీరతామని ప్రకటించారు. కాగా, విద్యాలయాల్లో మతపరమైన వస్త్రధారణ అంగీకారయోగ్యం కాదనీ, అందరూ ఆయా సంస్థలు నిర్ణయించిన వేషధారణనే అనుసరించాలంటూ కోర్టు తీర్పనిచ్చింది. తాజాగా కోర్టు నిర్ణయం పట్ల యువతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతారా? అనేది వేచి చూడాలి.