అబ్దుల్లాపూర్ ఎఫెక్ట్..  మా ఆఫీస్‌లో లంచాలు తీసుకోం..  - MicTv.in - Telugu News
mictv telugu

అబ్దుల్లాపూర్ ఎఫెక్ట్..  మా ఆఫీస్‌లో లంచాలు తీసుకోం.. 

December 2, 2019

We don't take bribe board in front of mangalagiri municipal

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటన యావత్ ప్రభుత్వ ఉద్యోగులను కుదిపేసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎలక్ట్రిసిటీ సర్కిల్ ఆఫీసులో కమర్షియల్ ఏడీఈగా పనిచేస్తున్న పోడేటి అశోక్ అనే అధికారి ‘నేను లంచం తీసుకోను’ అంటూ తన చాంబర్‌లో బోర్డు పెట్టుకున్న సంగతి తెల్సిందే. దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అశోక్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని మంగళగిరి మున్సిపల్ కమిషనర్ కూడా వినూత్నంగా ఆలోచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నిజాయితీగా పనిచేస్తే అవినీతే ఉండదని భావించిన కమిషనర్ లంచం తీసుకోమంటూ ఏకంగా ఆఫీస్ ఎదుట బోర్డు పెట్టించారు. ‘మంగళగిరి పురపాలక సంఘం. ఈ ఆఫీసులో నేను కాని.. నా సిబ్బంది కాని ఎవ్వరూ లంచాలు తీసుకోము. ఇది అవినీతి రహిత ఆఫీసు. లంచం తీసుకోవడం నేరం. లంచం ఇవ్వడం నేరం ఇట్లు కమిషనర్’ అని బోర్డుపై రాయించారు. లంచం తీసుకోమంటూ కమిషనర్ బోర్డు పెట్టించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.