ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సులభతర పన్ను విధానాల వల్ల ఈ ఏడాది రూ. 14 లక్షల కోట్లు పన్ను వసూలైందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వసూళ్లు పెరగడంతో పాటు పన్ను రిటర్నులు కూడా పెరిగినట్టు ఆమె తెలిపారు. దేశ రాజధానిలో జరిగిన 163వ ఆదాయపన్ను దినోత్సవం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ‘2021-22 ఆర్ధిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ. 14.09 లక్షల కోట్లు కాగా, వృద్ధి 49 శాతం నమోదైంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ. 14.20 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పన్నుల వ్యవస్థలో చాలా ఏళ్లుగా ఉన్న సమస్యలను పరిష్కరించాం. టెక్నాలజీ వినియోగంతో పారదర్శకత పెరిగింది. పన్ను చెల్లింపుదారులు చాలా విశ్వాసంతో ఉన్నారు. వచ్చే 25 ఏళ్ల కాలానికి వృద్ధి ప్రణాళికలను ఆదాయపన్ను శాఖ రూపొందించుకోవాలి’ అని వెల్లడించారు.