We have decided to work together in future - TRS, CPI
mictv telugu

ఇక నుంచి కలిసి పని చేయాలని డిసైడ్ అయ్యాం – టీఆర్ఎస్, సీపీఐ

November 8, 2022

We have decided to work together in future - TRS, CPI

మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి కారణం కమ్యూనిస్టులు ప్రచారం చేయడమేనని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయించామని, అందుకే భవిష్యత్తులోనూ ఐక్యంగా కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

ఉప ఎన్నికలో విజయానికి కృతజ్ఞతగా ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, గాదరి కిషోర్‌‌లతో కలిసి మంత్రి హైదరాబాదులోని సీపీఐ కార్యాలయానికి వచ్చారు. ఈ సంద్భంగా సీపీఐ నేతలు వీరికి ఘన స్వాగతం పలికారు. కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట రెడ్డి, పల్లా వెంకట రెడ్డిలు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. కూనంనేని మాట్లాడుతూ.. తెలంగాణను పెద్ద విపత్తు నుంచి కాపాడామన్న సంతోషం తమకు ఉందని, మునుగోడు ఫలితంతో బీజేపీకి శుభం కార్డు పడిందని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టు నేతలతో కలిసి ప్రభాకర్ రెడ్డి మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. ఆయన దానికి సరేనంటూ తన విజయానికి దోహదం చేసిన వామపక్షాలకు కృతజ్ఞత తెలిపారు.