మనకు ఎవ్వరు లేరు.. మనతో ఎవ్వరు రారు: ఉక్రెయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

మనకు ఎవ్వరు లేరు.. మనతో ఎవ్వరు రారు: ఉక్రెయిన్

February 25, 2022

ఉక్రెయిన్ దేశ రాజధాని కీవ్ ప్రాంతంలోకి రష్యా బలగాలు చొరబడి, దాడులు చేసి కీవ్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. “నేను దేశం విడిచిపారిపోయాను అని వదంతులు వస్తున్నాయి. నేనెక్కడికీ పారిపోలేదు. యుద్ధంలో ఒంటరైపోయాం. మనతో కలిసి యుద్ధం చేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? నాకు ఎవరూ కనిపించట్లేదు. నాటో సభ్యత్వంపై ఉక్రెయిన్‌కు ఎవరు హామీ ఇవ్వగలరు? అందరూ భయపడుతున్నారు” అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

VIDEO

 

అంతేకాకుండా విదేశాల నుంచి ఎలాంటి సాయాన్ని ప్రజలు ఇక ఆశించవద్దు. రష్యాను చూసి భయపడట్లేదు. పోరాడి దేశాన్ని కాపాడుకుంటామని అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ స్పష్టం చేశారు. రష్యా దాడుల్లో బలగాలు, సాధారణ ప్రజలు ఇప్పటికే 137 మంది మంది చనిపోయారని, మరో 316 మంది గాయపడ్డారని అన్నారు. రష్యా విధ్వంసక బృందాలు దేశంలోకి చొరబడ్డాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. ఎవరికి వారు ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

రష్యా తాను, తన కుటుంబం దేశంలోనే ఉన్నామని, రష్యా తనను నెంబర్ 1గా, తన కుటుంబాన్ని నెంబర్ 2గా టార్గెట్ పెట్టుకుంది అని అన్నారు. అయితే తాను ఎక్కడ ఉన్నానన్న విషయాన్ని ప్రస్తుతానికి చెప్పలేను అని వొలోదిమిర్ జెలెన్ స్కీ పేర్కొన్నారు.