మేం సాధించిందేమీ లేదు.. పుతిన్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు - MicTv.in - Telugu News
mictv telugu

మేం సాధించిందేమీ లేదు.. పుతిన్ ప్రతినిధి సంచలన వ్యాఖ్యలు

March 24, 2022

02

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టి నెల రోజులు కావొస్తోంది. ఇప్పటి వరకూ రెండు దేశాలు సాధించిందేమీ లేదు. చాలా వరకు నష్టాలను చవి చూశాయి. ఈ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రతినిధి పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్‌ను ఈ విషయంపై ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. యుద్ధం ద్వారా రష్యా సాధించింది ఏమీ లేదని బదులిచ్చారు. అయితే ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే సైనిక చర్య జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదికాక, పుతిన్ సలహాదారు, రష్యా పర్యావరణ దౌత్యవేత్త అనతోలి చుబైస్ తన పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి వెళ్లిపోయారు. పుతిన్ చర్యలు నచ్చట్లేదని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రష్యా అధికారికంగా ధృవీకరించింది. మరోవైపు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గూగుల్ వార్తలను రష్యాలో నిషేధిస్తున్నట్టు ఆ దేశ కమ్యూనికేషన్ రెగ్యులేటరీ ప్రకటించింది. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లను ఆ దేశంలో నిషేధించారు. ఇంతకు ముందు రష్యాకు వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే ఛానెళ్లు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, వారిని జైలుకు పంపే కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవికాక, అంతర్జాతీయంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐక్యరాజ్యసమితిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. తీర్మానానికి 9 దేశాల మద్ధతు అవసరం కాగా, భారత్ సహా 12 దేశాలు ఓటింగుకు గైర్హాజరయ్యాయి.