ఆర్మీలో చేరాలనుకుంటున్నవారికి ‘మేజర్’ సాయం - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్మీలో చేరాలనుకుంటున్నవారికి ‘మేజర్’ సాయం

June 4, 2022

ముంబయి ఉగ్రదాడిలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మేజర్ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అడవిశేశ్ నటన అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు వస్తున్నాయి.

దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాదులో శనివారం జరిగింది. ఈ సందర్భంగా అడవి శేశ్ మాట్లాడుతూ ‘మేజర్ సినిమా చూసి చాలా మంది ఆర్మీలో చేరాలనుకుంటున్నారు. సినిమాతో మోటివేటయి దేశసేవ చేయాలనుకుంటున్నట్టు చాలా మంది నాకు మెసెజులు పంపుతున్నారు. అలాంటి వారికి మేజర్ తరపున సహాయం చేయాలనుకుంటున్నా. ఇది మా ప్రామిస్. ఎలా సహాయం చేయాలన్నది త్వరలో చెప్తాం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతోనే దానిని ప్రారంభిస్తాం. మొదట తక్కువ మందితో ప్రారంభమైనా కాలక్రమేణా కోట్ల మందికి ఉపయోగపడేలా తీర్చి దిద్దుతాం’ అని చెప్పారు.