We increased .. You also increase: TS RTC
mictv telugu

మేం పెంచినం.. మీరు కూడా పెంచండి: టీఎస్ ఆర్టీసీ

June 14, 2022

తెలంగాణ రాష్ట్రంలో నష్టాల్లోకి వెళ్లిన ఆర్టీసీని తిరిగి గాడిలో పెట్టిందుకు ఆర్టీసీ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వినూత్న రీతిలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూన్నారు. తాజాగా టీఎస్ ఆర్టీసీ అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులకు రాసిన ఓ వినతిపత్రం సంచలనంగా మారింది. ఏపీ, తెలంగాణల మధ్య తిరిగే బస్సు సర్వీసుల్లో ఛార్జీలను పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని, టీఎస్ ఆర్టీసీ కోరింది. ఇందుకు కారణం.. కొన్ని నెలలక్రితం ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ, కేసీఆర్ సర్కార్ ప్రకటన విడుదల చేసింది. తాజాగా రెండోవసారి భారీగా బస్సు ఛార్జీలను పెంచుతూ, ప్రకటన విడుదల చేసింది. అయితే, పెరిగినా ఛార్జీలతో ఏపీ, తెలంగాణ మధ్య తిరిగే బస్సు సర్వీసుల్లో టికెట్ల రేట్లలో తేడా వచ్చింది. దీంతో రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నడిపే సర్వీసుల్లో ఒకే విధమైన ఛార్జీలు ఉండాలి. అందుకోసమే బస్సు ఛార్జీలను పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని టీఎస్ ఆర్టీసీ కోరింది.

ఏపీకీ హైదరాబాద్ సిటీ నుంచి రోజుకు వందల సంఖ్యల్లో ప్రయాణికులు పయనిస్తుంటారు. దీంతో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెరగడంతో, ప్రయాణికులు ఏపీ ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ సంస్థపై సంపద వర్షం కురిపిస్తోంది. ఈనెల 9న టీఎస్ ఆర్టీసీ రెండోసారి డీజిల్ సెస్ పేరుతో టికెట్ల రేట్లను భారీగా పెంచింది. పల్లె వెలుగు నుంచి ఏసీ బస్సుల వరకు కిలో మీటర్ల వారీగా రూ. 5 నుంచి రూ.170 వరకు పెంచేసింది. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల మధ్య ఛార్జీల్లో భారీ వ్యత్యాసం కనిపించడంతో టీఎస్ ఆర్టీసీ అధికారులు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులకు.. ‘మేం టికెట్లు పెంచినం, మీరు కూడా పెంచండి’ అంటూ లేఖను రాశారు.