కుల పిచ్చి మీడియా వల్లే ఓడిపోయాం: మాయవతి - MicTv.in - Telugu News
mictv telugu

కుల పిచ్చి మీడియా వల్లే ఓడిపోయాం: మాయవతి

March 11, 2022

maya

ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం మీడియానే అంటూ మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉత్తర భారతదేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఆ ఫలితాలలో బీజేపీ పార్టీ పంజాబ్‌లో తప్ప మిగతా నాలుగు రాష్ట్రాల్లో విజయఢంకా మోగించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో మళ్లీ బీజేపీ పార్టీనే అధికారాన్ని చేపట్టింది. శుక్రవారం బీఎస్పీ అధినేత మాయవతి మీడియాతో మాట్లాడుతూ.. “ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ నుండి ముస్లింలను దూరం చేసింది కేవలం కులతత్వ మీడియానే. సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ‘జంగల్ రాజ్’ మళ్లీ వస్తాదనే భయంతో కథనాలు రాస్తూ, ముస్లింలను భయపెట్టి బీజేపీ వైపు మళ్లీంచారు” అని అన్నారు.

బీఎస్పీని బీజేపీకి చెందిన బి టీంగా చూపుతూ.. మీడియా అసత్య ప్రచారం చేసిందని మండిపడ్డారు. ‘దీంతో ముస్లిం మాకు దూరమైయ్యారు. అగ్రవర్ణాలు, వెనుకబడిన ఇతర వర్గాలలోని పార్టీ మద్దతుదారులు సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ‘జంగిల్ రాజ్’ మళ్లీ యూపీలో తిరిగి వస్తారనే భయంతో ఆ కమ్యూనిటీల వారు బీజేపీకి ఓటు వేశారు’ అని మాయావతి తెలిపారు.

ముస్లింలు తమకు కాకుండా సమాజ్‌వాదీ పార్టీకి ఓట్లు వేసి పొరపాటు చేశారని మాయవతి అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ముక్కోణపు పోటీ జరిగి ఉంటే అప్పుడు బీఎస్పీ ఆశించిన విధంగా ఫలితాలు  వచ్చేదని ఆమె పేర్కొన్నారు.