మాకు ఉమ్మడి భర్త కావాలి.. యువతుల బంపరాఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

మాకు ఉమ్మడి భర్త కావాలి.. యువతుల బంపరాఫర్

March 26, 2022

7

ఇప్పటి వరకు మనం ఎన్నో వింతైన విషయాలు విని ఉంటాం. కానీ, ఇలాంటి ఆఫర్ మాత్రం ఖచ్చితంగా విని ఉండం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు, ఒక స్త్రీ దేన్నైనా పంచుకుంటుంది. కానీ, జీవిత భాగస్వామిని మాత్రం ఎవరితోనూ పంచుకోవడానికి సిద్ధపడదు వంటి డైలాగులకు కాలం దగ్గర పడిందేమో. ఎందుకంటే మలేషియాకు చెందిన ఇద్దరు స్త్రీలు తమకు ఉమ్మడి భర్త కావాలంటూ ఫేస్బుక్‌లో పోస్ట్ చేశారు. తమకు కావాల్సిన లక్షణాలు, అభిరుచులను అందులో ఏకరువు పెట్టారు. మేమిద్దరం మంచి స్నేహితులమని, మమ్మల్ని మంచిగా చూసుకునే భర్త కావాలంటూ ప్రపంచానికి తెలియజేశారు. 31 ఏళ్ల ఫాతిమా, 27 ఏళ్ల ఫాతిన్ అక్మాలు ఈ ఆఫర్ ఇచ్చారు. ఫాతిమాకు ఇప్పటికే పెళ్లయి బిడ్డను కని విడాకులు తీసుకుంది. ఫాతిన్ లాండ్రీ షాపు నడుపుతోంది. వీరిద్దరూ సెన్సే మలేషియా పేరుతో తమ ఫీలింగ్‌ని షేర్ చేశారు. ఒకరి తర్వాత ఒకరం పెళ్లి చేసుకుంటామని ఆనందంగా చెప్తున్నారు. ఇందుకు సిద్ధపడిన వారు తమను సంప్రదించవచ్చని వివరాలు కూడా పొందుపర్చారు. దీన్ని చూసి చాలా మంది ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. బ్యాచిలర్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తమ అనుమానాలను కామెంట్ చేస్తున్నారు. మీకేమైనా ఆసక్తి ఉంటే ప్రయత్నించి చూడండి.