We sell only spare parts of F16 fighter jets : America
mictv telugu

అది ఆయుధ సాయం కాదు.. అమ్మకం మాత్రమే : అమెరికా

September 9, 2022

We sell only spare parts of F16 fighter jets : America

అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌కు 450 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సాయం చేసినట్టు గురువారం వార్తలు వచ్చాయి. ట్రంప్ హయాంలో సాయాన్ని నిలిపేస్తే బైడెన్ వచ్చాక పునరుద్ధరించారంటూ ఆందోళన వ్యక్తమైంది. భారత్ కూడా స్పందించి ఖండించగా, గందరగోళానికి కారణమైన ఈ సాయంపై వివరణ ఇచ్చింది.

ఇవి అమ్మకాలే కానీ, సాయం కాదని తేల్చి చెప్పింది. దక్షిణాసియా, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ‘ఒక దేశానికి అందించే రక్షణ పరికరాలకు మద్దతు ఇవ్వడం అమెరికా ప్రభుత్వ విధానం. ఇది విడి భాగాల అమ్మకం మాత్రమే. సాయం కాదు. మేం ఎలాంటి యుద్ధ విమానాలను పాకిస్తాన్‌కు ఇవ్వట్లేదు. 40 ఏళ్ల క్రితం ఇచ్చిన ఎఫ్ 16 యుద్ద విమానాల స్పేర్ పార్ట్స్ మాత్రమే ఇచ్చాం. దీనివల్ల గతంలో అమ్మిన విమానాలు వాయు భద్రతా ప్రమాణాల ప్రకారం ఉండగలుగుతాయి. అంటే కేవలం సర్వీస్ అందిస్తున్నామే తప్ప కొత్త ఆయుధాలు, టెక్నాలజీ వంటివి కావు’ అని వివరించారు. దీనిపై భారత్ ఆందోళనను తాము అర్ధం చేసుకోగలమని పేర్కొన్నారు.