ఆర్టికల్ 370, సీఏఏపై వెనకడుగు వేయం.. మోదీ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టికల్ 370, సీఏఏపై వెనకడుగు వేయం.. మోదీ

February 16, 2020

CAA.

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌లపై తీవ్ర ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం తమ నిర్ణయం మార్చుకోదని.. వాటిని అమలు చేస్తామని ఘంటాపథంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ.. సీఏఏపై తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. తన సొంత నియోజకవర్గం అయిన వారణాసి-చౌందౌలి సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ మెమెరియల్ సెంటర్‌ను ఆదివారం నాడు మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘370 అధికరణ రద్దు, సీఏఏపై తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ ప్రకారమే ముందుకు వెళ్తాం. అయోధ్యలో రామాలయ నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్టుకు అయోధ్యలో సేకరించిన 67 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం అందజేస్తుంది’ అని మోదీ అన్నారు. 

మోదీ ఈ పర్యటనలో భాగంగా రూ.1,200 కోట్ల విలువచేసే 36 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. మరో 14 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. దేశంలోని తొలి ఓవర్‌నైట్ ప్రైవేట్ ట్రైన్ ‘కాశీ మహాకాళ్ ఎక్స్‌ప్రెస్‌’ను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.