తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సంగతి తెలంగాణ ప్రజలకు, మాకు బాగా తెలుసు అని అన్నారు. అంతేకాకుండా, మాకంటే ఎక్కువగా బీజేపీ వాళ్లకే బీజేపీ సంగతి ఇంకా బాగా తెలుసు అని ఎద్దేవా చేశారు.
బుధవారం హైదరాబాద్లోని మాదాపూర్లో గల హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో మంత్రి హరీష్రావు కూడా పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”కేంద్రం ప్రభుత్వం ప్రజలకు ఒక్క పనైనా చేసిందా. బండి సంజయ్ దేనికోసం పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలి. నల్లధనం తీసుకువస్తాం అన్నారు. ఉద్యోగాలు వేస్తాం అన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం అన్నారు. ఇందులో ఒక్కటైనా నేరవేర్చారా” అని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వంతో ఏ వర్గానికైనా ఉపయోగం కలిగిందా. ఉన్న సంస్థలను అమ్ముకొని, ఉద్యోగులను రోడ్డున పడేస్తుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజలకు ఏం చేసింది. బీజేపీ సంగతి ప్రజలకు, మాకు, మాకంటే.. ఎక్కువగా బీజేపీ వాళ్లకే తెలుసు’ అన్నారు.