టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ఆసక్తిర విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘మండే లంచ్. ఎప్పుడూ మిస్ అవ్వం. ఎన్నో కథలు చెబుతుంటారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. మేం అంతా కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాం మామయ్య గారు’ అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
మరోపక్క నమత్ర మంచి ఫ్యామిలీ పర్సన్ అని అందరికి తెలిసిందే. మహేశ్ బాబు స్టార్ హీరో అయినప్పటికీ ఆమె సింపుల్‌గా ఉంటూ మహేశ్ బాబుకు సపోర్ట్‌గా ఉంటారు. అంతేకాకుండా మహేశ్ బాబు కుటుంబ సభ్యులతో ఎప్పుడు నార్మల్‌గానే ఉంటాడు. విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో టూర్స్ వేస్తుంటాడు. ఇది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నుంచే నేర్చుకున్నానని మహేశ్ చెబుతుంటాడు. అప్పట్లో కృష్ణ ఫుల్ బీజీగా ఉన్నప్పటికీ.. కుటుంబానికి మాత్రం సమయం కేటాయించేవాడట. ప్రతి రోజు ఉదయం కచ్చితంగా ఫ్యామిలీతో కలిసి టిఫిన్ చేసేవాడట. రాత్రి పిల్లలతో మాట్లాడేవాడట. ఇప్పుడు మహేశ్ కూడా అదే వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. వారానికి ఒక్క రోజు అయినా.. తన ఫ్యామిలీ అంతా కృష్ణ ఇంట్లో గడుపుతామని నమ్రత తెలిపారు.