అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా ఇండ్లు ఇస్తాం.. హరీశ్ రావు - MicTv.in - Telugu News
mictv telugu

అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా ఇండ్లు ఇస్తాం.. హరీశ్ రావు

October 23, 2019

Harish Rao

అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా ఇండ్లు కట్టించి ఇస్తాం అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్ధిపడగ తండాలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. నిరుపేదలకు నిలువెత్తు గౌరవం డబుల్ బెడ్‌రూం ఇండ్లు అని అన్నారు.  దేశంలో మరెక్కడా ఇలాంటి ఇండ్లను నిర్మించి ఇవ్వడం లేదు. అన్ని వసతులతో ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం అని పేర్కొన్నారు.

అగ్రవర్ణాల్లోని నిరుపేదలకు కూడా ఇండ్లు కట్టించి ఇస్తాం అని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. వ్యవసాయాన్ని లాభదాయకం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు. సోషల్ మీడియా ఊబిలో యువత చిక్కుకోవద్దని హితవు పలికారు. సమయాన్ని వృథా చేయడం మంచిది కాదు. కష్టపడి పని చేయాలనుకుంటే అనేక మార్గాలు వున్నాయి  అని అన్నారు. యువకులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అనంతరం నంగునూరు మండలంలోని అంక్షాపూర్ గ్రామంలోని నభి చెరువులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో 70వేల చేప పిల్లలను మంత్రి విడుదల చేశారు.