మోదీని హత్య చేస్తాం..ఈమెయిల్‌‌లో బెదిరింపు - MicTv.in - Telugu News
mictv telugu

మోదీని హత్య చేస్తాం..ఈమెయిల్‌‌లో బెదిరింపు

April 1, 2022

14

భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేసేందుకు కుట్ర చేసినట్టు ముంబైలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.’మోదీని చంపేస్తామని ఈమెయిల్‌లో బెదిరించారు. ప్రధాని మోదీ హత్యకు 20 మందితో స్లీపర్‌సెల్‌ రెడీగా ఉందని ఈమెయిల్‌ ద్వారా సమాచారాన్ని పంపించారు. మోదీ హత్యకు 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను కూడా సిద్దం చేసినట్టు ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నారు’ అని అధికారులు తెలిపారు.

దీంతో అప్రమత్తమైన కేంద్ర హోంశాఖ ఈమెయిల్‌పై అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశింది. వివిధ ఏజెన్సీలకు ఈమెయిల్‌ వివరాలను పంపించింది. ఎక్కడి నుంచి ఈమెయిల్‌ వచ్చింది? ఎవరు ఈమెయిర్‌ పంపించారన్న విషయంపై దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. ఇది కచ్చితంగా టెర్రరిస్టుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.