పోలవరం ఖర్చంతా మేమే భరిస్తాం.. కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

పోలవరం ఖర్చంతా మేమే భరిస్తాం.. కేంద్రం

March 4, 2022

gnfgn

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర జ‌ల శ‌క్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ శుభవార్త చెప్పారు. పోలవ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు మొత్తాన్ని కేంద్ర‌ ప్రభుత్వమే భ‌రిస్తుంద‌ని అన్నారు. శుక్రవారం పోల‌వరం ప్రాజెక్టును జగన్‌తో కలిసి కేంద్రమంతి షకావత్ సంద‌ర్శించిన విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా షెకావ‌త్ జ‌గ‌న్ సమ‌క్షంలోనే ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీకి పోలవరం జీవ‌నాడిగా ఆయన అభివ‌ర్ణించారు. జాతీయ హోదా క‌లిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్య‌యం మొత్తాన్ని కేంద్ర‌మే భ‌రిస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

మరోపక్క దేవీప‌ట్నం మండ‌లం ఇందుకూరు-1లోని ప్రజలకు ఇచ్చిన మాటను మార్చిపోలేదు. త్వరలోనే నిలబెట్టుకుంటా అని జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షెకావ‌త్ నోట పోలవరం ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుంది చెప్పడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుకు సవరించిన అంచనాల విషయంలో రాష్ట్రం ఇవ్వాల్సిన వివరాలు ఇవ్వటం లేదని, వివరాలు ఇచ్చిన తర్వాత నిధులను ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామని షేకావత్ అన్నారు.