హిండెన్ బర్గ్ నివేదికతో ఘోరంగా నష్టపోయిన గౌతం అదానీకి బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ఉంటే అదానీ గ్రూపుకు ఎంత లోన్ కావాలంటే అంత ఇస్తామని సంచలన ప్రకటన చేసింది. మార్కెట్లో అదానీ షేర్ వ్యాల్యూ పడిపోవడం, కంపెనీలో అస్థిరతను తాము పట్టించుకోమని, అదానీ అడిగిందే తడవుగా రుణం మంజూరు చేస్తామని సీఈవో కం ఎండీ సంజీవ్ ఛద్దా వెల్లడించారు.
ఈ క్రమంలో ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబైలోని ధారావి రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టు కోసం అదానీకి రుణం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం గతేడాదే అదానీ గ్రూప్ 50.70 బిలియన్ల బిడ్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఇందుకు కావాలసిన రుణాన్ని అందిస్తామని, ముందస్తు చెల్లింపులు, సమయానికి తిరిగి చెల్లించే రుణగ్రహీతలను తాము వదులుకోమని స్పష్టం చేశారు. కాగా, అదానీ విషయం పార్లమెంటులో కూడా రచ్చలేపింది. చివరికి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అది ప్రస్తుతం విచారణలో ఉంది.