ఉచితంగా ఇస్తాం.. డబ్బులిస్తామంటే మీ ఇష్టం : కేజ్రీవాల్ - MicTv.in - Telugu News
mictv telugu

ఉచితంగా ఇస్తాం.. డబ్బులిస్తామంటే మీ ఇష్టం : కేజ్రీవాల్

May 5, 2022

We will give electricity subsidy to those who want it : KEJRIWAL

ఆప్ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం రోజు కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 1 నుంచి ఉచిత విద్యుత్‌ను ఆప్షనల్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వపరంగా సబ్సీడీ కొనసాగుతుందని, ఎవరైనా ఉచిత విద్యుత్ వద్దు, మేం డబ్బులిస్తామంటే తీసుకుంటామని వెల్లడించారు.

సబ్సీడీ కావాలా వద్దా అనేది అధికారులు ఇంటింటికీ వచ్చి వివరాలు తీసుకుంటారని తెలిపారు. ‘బిల్లులు చెల్లించే కెపాసిటీ ఉన్నవారు, ఉచితంగా తీసుకోవడానికి నిరాకరించే వారు ప్రభుత్వానికి చెప్పొచ్చు. అక్టోబర్ 1 నుంచి ఎంపిక చేసుకున్న వారికే ఉచిత విద్యుత్ లేదా రాయితీ అందుతుంది’ అని స్పష్టం చేశారు. కాగా, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తుండగా, 201 నుంచి 400 యూనిట్లు వాడేవారికి రూ. 800 సబ్సిడీ ఇస్తున్నారు. దీనిపై విమర్శలు రావడంతో రాయితీని కోరుకున్నవారికే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.